రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం !

-

తెలంగాణ పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం అందించేందుకు ముందుకు వచ్చింది రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు.

పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామని తెలిపారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాల్కు 500 రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు దీన్ని వర్తింప చేస్తామని కూడా వివరించారు.

అలాగే త్వరలో కొత్త రూపంలో రేషన్ కార్డుల జారీ కానున్నాయట. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మారనున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.ఎన్నికల కోడ్ ముగిశాక కార్డులు ఎలా ఉండాలని దానిపై చర్చించనున్నారట. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు చిన్న పుస్తకంలో ఉండేవి. ఆ తర్వాత పాస్ బుక్ సైజులో జారీ చేశారు. తర్వాత వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news