దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు భారీగా పెరుగుతుంది. కరోనా కేసులను కట్టడి చేయడం పక్కన పెడితే వైద్య సేవల విషయంలో మాత్రం దేశం లో ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడం లో సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా సరే మరణాలు కూడా దాదాపుగా కట్టడిలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపుగా 70 శాతానికి చేరుకుంది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15 లక్షలు దాటింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రికవరీ రేటు పెరుగుతుంది అని చెప్పింది. పది రాష్ట్రాల్లో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందని వివరించింది. 80 శాతం వరకు ఉందని పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలో మాత్రమే రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ఏపీలో చాలా దారుణంగా ఉంది అని లెక్కలు చెప్తున్నాయి.