ఏపీ అంగన్వాడీలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం దాదాపు నెల రోజుల క్రితమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది.
అయితే నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ, నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీపై విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.