అన్నదాతలకు గుడ్ న్యూస్.. 13వ విడత డబ్బులు అప్పుడే..!

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి ద్వారా మనం ఎన్నో లాభాలని పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనాలని పొందుతున్నారు. ఇక ఇప్పుడు 13వ విడతను ఇవ్వాల్సి వుంది.

farmers

మరి ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పటి దాకా పన్నెండు విడతల డబ్బులు వచ్చాయి. 12వ విడతగా రైతుల ఖాతాలో 2000 రూపాయలు వచ్చాయి. మిగిలిన అమౌంట్ ఇంకా రావాల్సి వుంది. ఈ డబ్బులు పడ్డాక ఆ డబ్బులు వస్తాయి. ఇక ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది చూస్తే.. పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు రైతుల అకౌంట్ లోకి
డిసెంబర్‌ 20న జమ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

ఒకవేళ కనుక రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వారు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చెయ్యచ్చు. లేదంటే మెయిల్ ఐడిలో మెయిల్ చేయచ్చు. 155261 లేదా 1800115526 లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. ఒకవేళ కనుక మీరు మెయిల్ చెయ్యాలంటే [email protected] లో మెయిల్ చేయవచ్చు. ఇలా ఈజీగా రైతులు వారి సమస్యను పరిష్కరించుకోవచ్చు.