ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వము నుండి రెండు మూడు రోజుల్లోగా ఉద్యోగుల శాలరీ కి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఉద్యోగుల డీయర్ నెస్ అలోవెన్స్(డీఏ) పెరగనుంది. అలానే జీతం కూడా పెరుగుతుందట. అయితే ఇప్పుడు అది ఎంత పెరుగుతుంది..? ఎప్పుడు పెరుగుతాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి వుంటుందట. అయితే అప్పుడు ఏడో వేతన సంఘం స్థానం లో ఎనిమిదో వేతన సంఘ సూచనలను ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల పై ప్రకటన చేస్తుందని అంటున్నారు. 2023 బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ఏమైనా చెబుతారని అంతా చూసారు కానీ ఏమి మాట్లాడలేదు.
వచ్చే ఏడాది ఏడో వేతన సంఘం స్థానంలో ఎనిమిదో వేతన సంఘ సిఫార్సులను అమలు చెయ్యచ్చని మరో సారి వినపడుతోంది. నిజానికి ప్రతి పదేళ్లకు ఒక సారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పే కమిషన్ నిబంధనలు మారతాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై ఇప్పటికి అధికారిక ప్రకటన లేదు. 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు దీనిపై కేంద్రం ప్రకటించచ్చని అంటున్నారు. అలానే 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతుందని ఇంకొంత మంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.