‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. చరిత్ర సృష్టించిందన్న చంద్రబాబు

-

 

నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడంపై హర్షం వ్సక్యం చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. భారత సినీ చరిత్రలో ఆస్కార్ పురస్కారం లభించడం ఓ చరిత్ర అని తెలిపారు చంద్రబాబు. ఈ అవార్డును తెలుగు వాళ్లు సాధించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లీ గంజ్, కాలభైరవ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. తెలుగు పాట ఈ ఘనత సాధించటం భారతీయ సినిమాకు గర్వకారణమననారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు అని తెలిపారు చంద్రబాబు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫ్జెంట్ విస్పర్స్ బృందానికి నా శుభాభినందనలు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news