తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. ఆ నిబంధన ఎత్తివేత !

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. కనీస మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్‌ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణ యం తీసుకుంది. దీని కారణంగా ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాదిపరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్‌ కు అర్హత లభించనుంది.

వాస్తవానికి ఇంటర్‌ మీడియెట్‌ ఓ కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ సీటు సంపాదించే వీలు ఉంటుంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు గా ఈ నిబంధననను సడలించారు. టెన్త్‌ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ కు విద్యార్థులు ప్రయోట్‌ అయ్యారు.

ఈ లెక్కన ఫస్టియర్‌ అనుభవాలను పరిగణలోనికి తీసుకుంటే.. ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 3 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్‌ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉన్నత విద్యా మండలి దీనిపై చర్చించి నిర్నయం తీసుకునే ఛాన్స ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news