’ట్రిపుల్ ఆర్’ నిలిపివేయాలి… తెలంగాణ హైకోర్ట్ లో పిల్

-

ప్రపంచవ్యాప్తంగా మచ్ అవెయిడ్ మూవీ ’ట్రిపుల్ ఆర్’. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతోంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం, తమిళం భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది జనవరిలోనే మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా థర్డ్ వేవ్ మూలంగా రిలీజ్ వాయిదా పడింది. సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా నిర్వహించారు. ధర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా… ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. వీరిద్దరికి జోడీగా అలియా భట్, ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉందో అంతే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. అల్లూరి, కొమురంభీంల చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ.. తెలంగాణ హైకోర్ట్ లో పిల్ దాఖలైంది. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ… పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. వారి అసలు చరిత్ర కాకుండా.. కాల్పనిక కథతో సినిమాను తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోర్ట్ ను కోరింది. ఇది వరకు ఏపీ హైకోర్ట్ లో కూడా ఇలాంటి పిటిషనే దాఖలు అయింది. ఈ వివాదంపై కోర్ట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news