పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్ ఇదే..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ అయింది. ప్రజెంట్ ఈ ఫిల్మ్ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. కాగా, ఆయన నటిస్తున్న నెక్ట్స్ మూవీస్ అప్ డేట్ కోసం పవన్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ పిక్చర్ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.

 

17వ శతాబ్దం నాటి మొఘలుల నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు తన సినీ కెరీర్ లో పోషించని పాత్రను పోషిస్తున్నారని, భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారని సాయిమాధవ్ బుర్రా తెలిపారు. డైరెక్టర్ క్రిష్ పవన్ కల్యాణ్ చాలా కొత్తగా, చక్కగా ప్రజెంట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా ఫిల్మ్ కాగా, ఇందులో హీరోయిన్ గా బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ నటిస్తోంది. కీలక పాత్రలను అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంత వరకు చేయని జోనర్ సినిమా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జానపద నేపథ్యంలోనూ సినిమా ఉంటుందని టాక్. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి ఈ చిత్ర సెట్స్ ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రంపైన అంచనాలు రోజురోజుకూ ఇంకా పెరిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news