పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి గడువు ఎక్స్టెండ్ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఎక్కువ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే అప్లై చెయ్యచ్చు.

వాళ్లకి ఇప్పుడు రిలీఫ్ కూడా కలగనుంది. మే 3 వరకు గడువు ఉంటుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఛాన్స్ అందరికీ ఉండదు. 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళే ఈ అవకాశం ని పొందడానికి అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబర్ కన్నా ముందు రిటైర్ అయిన వాళ్లకి ఈ అవకాశం ఇస్తోంది. మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు మీటింగ్ డేట్ కూడా మారింది. మీటింగ్ మార్చి 25, 26న జరగాల్సి ఉంది కానీ దీన్ని మార్చి 27, 28 తేదీల్లోకి మార్చేశారు. అధిక పెన్షన్ అంశంపై కూడా స్పష్టత ఇవ్వొచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news