దీపావళికి 6.5 కోట్ల పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

గుడ్ న్యూస్. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 6.5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్ లో వడ్డీ మొత్తాన్ని బదిలీ చేస్తున్నారు. దీనితో 6.5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 2021-22 వడ్డీని సబ్‌స్క్రైబర్‌ల ఖాతాలకు బదిలీ చేయచ్చట.

అయితే ఈసారి 8.1 శాతం వడ్డీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జమ చేస్తోందట. ఇది డైరెక్ట్ గా పీఎఫ్‌ ఖాతాలో పడనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చివరి మీటింగ్ లో ఈ వడ్డీ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.

నెక్స్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సరే అందిట. బేసిక్, డియర్‌నెస్ అలవెన్స్‌లో ఖాతాదారులకు 24 శాతం కలిపి చెల్లిస్తారు. మొత్తం చెల్లింపుపై వడ్డీని ఇవ్వరు. అయితే మెసేజ్ ద్వారా వడ్డీ విషయంలో సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో​నుండి వడ్డీ బదిలీ గురించి సమాచారం మెసేజ్ ద్వారా అందుతుంది.

కేవలం ఓ మెసేజ్ పంపి మీరు ఖాతాలోని బ్యాలెన్స్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలానో చూస్తే.. మొబైల్ ఫోన్‌లో ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి 7738299899కి పంపాలి ఇలా బాలన్స్ ని తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా ఎంతో సులభంగా సమాచారం పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news