కాంపిటీషన్‌లో నిలబడాలంటే..మన దగ్గర ఏదో ఒక కొత్తదనం ఉండాలి.. అప్పుడే జనాల్ని బాగా ఆకట్టుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అయితే ఎవరు ఎంత కొత్త కంటెంట్ ఇస్తే జనాలు వాళ్లకు జై కొడతారు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్..ఈ ముడు వాడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు మూడింటిలో మన దోస్తులే ఉంటారు.. కానీ ఏ పోస్ట్ పెట్టినా ఒకేసారి మూడింటిలో పెట్టుకుంటాం..అదో ఆనందం.. అయితే ఎప్పటికప్పుడు వినియోగదారులకు స్పెషల్ ఫీచర్స్ ఇవ్వడం పనిగా పెట్టుకున్నాయి.. ఈ సోషల్ మీడియా దిగ్గజాలు..అదిరిపోయే అప్‌డేట్స్, ఫిదా అయిపోయే ఫీచర్స్‌ను తెస్తున్నాయి.. తాజాగా వాట్సప్‌లో ఒక ఫీచర్ వచ్చింది. నిజానికి ఎన్నో రోజులుగా ఇలాంటి ఓ ఫీచర్ ఉంటే బాగుండూ అని చాలామంది అనుకుంటూనే ఉన్నారు.. అదేంటంటే..
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్’ పేరిట ఈ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫోటోలు, వీడియోలను స్క్రీన్ షాట్స్ తీసే అవకాశం ఉండదు. బెటర్ యూజర్ ఇంటర్ ఫేస్ కోసం వాట్సాప్.. చాలా రోజులుగా పలు రకాల అప్ డేట్స్ మీద పరిశోధన చేస్తోంది. అందులో భాగంగానే మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ఈ యాప్ కొన్ని iOS బీటా టెస్టర్‌లకు ‘స్క్రీన్‌షాట్ బ్లాకింగ్’ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. టెస్ట్‌ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్ డేట్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీని వెర్షన్‌ను 22.21.0.71 వరకు తీసుకువస్తుంది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ WABetaInfo ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. “ఫోటోలు, వీడియోలను స్క్రీన్ షాట్ లు తీయడం, స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఇకపై సాధ్యం కాదు” అని WABetaInfo తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటి వరకు కొంత మంది iOS బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రాగా.. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని యాక్టివేషన్‌లు జరిగే అవకాశం ఉంది. ఫోటోలు, వీడియోలు డిఫాల్ట్ గా బ్లాక్ చేయబడిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్, స్కీన్ షాట్ తీయడాన్ని వాట్సాప్ అనుమతించదు.