ఏపీ సర్కార్ కి పోలవరం విషయంలో కేంద్రం గుడ్ న్యూస్..

పోలవరం బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. 2, 234 కోట్ల రూపాయల పోలవరం బకాయిలను విడుదల చేయడానికి అభ్యంతరం లేదని తెలిపింది. దీనికి సంబందించి కేంద్ర జలశక్తిశాఖకు.. ఆర్థిక శాఖ మెమో పంపింది. వీలైనంత త్వరగా పీపీఏను పూర్తి చేయాలని మెమోలో సూచించింది. ఖచ్చితంగా ఇది శుభవార్తేనని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటిదాకా 2, 234 కోట్ల రూపాయల బకాయిలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రం నుండి అందాల్సి ఉంది.

ఈ నిధులు మంజూరు చేయమని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతూ ఉంది. అయితే ముందుగా ఈ నిధుల మంజూరుని పీపీఏ ఆమోదించాల్సి ఉంది, ఆ తరువాత ఆర్ధిక శాఖకు పంపుతారు. ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ వలెనే ఈ నిధులు మంజూరు అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డబ్బు రావడంతో ఇప్పటి దాకా కేంద్రం పెట్టిన షరతులు అన్నీ తీసి పక్కన పెట్టినట్టు అయింది. దీంతో ఇక పోలవరానికి అడ్డంకులు తొలగినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.