ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు కన్నుమూత….!

వయోలిన్ విద్వాంసుడు, పద్మ అవార్డుల గ్రహీత టీఎన్ కృష్ణన్ చెన్నై నగరంలో కన్నుమూశారు. 1926 అక్టోబర్ 6న కేరళలో జన్మించిన కృష్ణన్ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నై మ్యూజిక్ కళాశాలలో పనిచేసిన కృష్ణన్ చాలామంది విద్యార్థులకు వయోలిన్ నేర్పించారు.11 సంవత్సరాల వయసులోనే వయోలిన్ కచేరిని నిర్వహించారు కృష్ణన్.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా పనిచేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత కళానిది వంటి పలు పురస్కారాలన అందుకున్నారు కృష్ణన్. దేశంలో వేలాది సంగీత కచేరీలు చేసిన కృష్ణన్ మృతి పట్ల సంగీతప్రియులు తమ సంతాపం తెలిపారు.