Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘సలార్’ గ్లింప్సెస్ రిలీజ్.. ఎప్పుడంటే?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులు కొంత మేరకు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ ‘సలార్’ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ప్రభాస్ ఈ చిత్రంలో ఊర మాస్ అవతారంతో పాటు మరో డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలోని రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లో పిక్చర్ షూటింగ్ జరిగింది. ప్రభాస్ అశేష అభిమానులు ‘సలార్’ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ప్రమోషన్స్ లో ప్రభాస్ ‘సలార్’ చిత్ర అప్ డేట్ ఇచ్చేశారు దర్శకులు ప్రశాంత్ నీల్.

వచ్చే నెలలో ‘సలార్’ చిత్ర గ్లింప్సెస్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు దర్శకులు తెలిపారు. ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ భామ శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘సలార్’ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ‘ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news