సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్…!!

-

భారతీయ రైల్వేలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు లక్షా 91 వేల 128 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే ఇది ఎక్కువ. 2021-22తో పోలిస్తే 2022-23 సంవత్సరంలో సరకు రవాణా ద్వారా రైల్వే ఆదాయం 27.75 శాతం పెరిగింది. అయితే రైల్వే ఆదాయంలో పెరుగుదల వలన రైల్వేలు సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని త్వరలో తిరిగి ఇవ్వడం మొదలు పెడతారని ఇప్పుడు భావిస్తున్నారు.

senior citizens

కరోనా సమయంలో ఈ మినహాయింపు ని నిలిపివేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండడంతో రైల్వేలు సీనియర్ సిటిజన్లతో సహా మూడు కేటగిరీలు మినహా మిగిలిన వారికి ఛార్జీలలో రాయితీని నిలిపేశారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లకి ఛార్జీలపై 50 శాతం తగ్గింపు వుంది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన మినహాయింపును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై మినహాయింపును పునరుద్ధరించాలని పార్లమెంటరీ ప్యానెల్ కూడా అంది. ఒకవేళ ఇది వస్తే సీనియర్ సిటిజెన్స్ కి గుడ్ న్యూస్ ఏ కదా… ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (IBEF) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం రైల్వే ప్రయాణీకుల నుండి 20% మాత్రమే సంపాదిస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల ఛార్జీల వాటా 20.2 శాతంగా ఉంది. సరుకు రవాణా వాటా 75.2 శాతం. ఇలా వీటి వలన 95.4 శాతం సంపాదన వస్తోంది. మిగిలిన 4.6 శాతం ఆదాయం స్క్రాప్ విక్రయంతో సహా ఇతర వనరుల నుండి వస్తుంది.

.

Read more RELATED
Recommended to you

Latest news