సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులు గుడ్ న్యూస్..!

-

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. దాంతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించేందుకు తల్లి తండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దాంతో ప్రభుత్వ స్కుళ్లపై మరింత దృష్టి పెడుతోంది సర్కార్. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ స్కుల్ళల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి.

కోడింగ్ తో పాటుగా ఇతర ప్రయోగాలను చేసేందుకు గానూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. దాంతో స్కూళ్ళలో అడ్మిషన్ ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news