మహిళలకి కేంద్రం గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసులని తీసుకు వచ్చింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో చేరిన మహిళలకి ఇది తీపికబురు అనే చెప్పాలి. ఇక పూర్తి వివరాలని చూస్తే మెటర్నిటీ బెనిఫిట్స్‌ను ఆన్‌లైన్‌లోనే పొందే వీలు కల్పించారు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ లో చేరితే ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

మెటర్నిటీ బెనిఫిట్స్‌ను ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు పొందచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ అన్నారు. దీని మూలంగా చాలా మందికి రిలీఫ్ కలగనుంది. ఆన్‌లైన్ మెటర్నిటీ బెనిఫిట్ క్లెయిమ్ ఫెసిలిటీని తెచ్చారు. ఇది మహిళలకి ప్లస్ అవుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు టెక్నాలజీ ద్వారా మంచి సర్వీస్ ని అందించాలని చూస్తోంది.

మెటర్నిటీ బెనిఫిట్స్‌ను ఈజీ చేయడానికి ఈ కొత్త ప్రాసెస్ ని తీసుకు వచ్చారు. మహిళలు ఎక్కడి నుంచైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ ని క్యాష్ రూపంలో పొందొచ్చు. ఎప్పుడైనా సరే నగదు ప్రయోజనం రూపంలో ప్రసూతి ప్రయోజనాలను పొందవచ్చు. మెటర్నిటీ బెనిఫిట్ కింద 26 వారాల వేతనాన్ని ఫ్రీ గానే పొందొచ్చు. మెటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే అప్లై చెయ్యచ్చు. దీని కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. నెలకు రూ. 21 వేల వరకు వేతనం పొందే వారు ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news