దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని తీసుకు వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ మహిళలకి గుడ్ న్యూస్ ని చెప్పింది. 10 లక్షల వరకు లోన్ ని ఇస్తోంది బ్యాంకు. మరి ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
సమూహ్ శక్తి స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. అర్హత కలిగిన మహిళలకు ఈ స్కీమ్ ద్వారా లోన్ ని ఇస్తోంది. ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి స్కీమ్ 2023 మార్చి 31 వరకే ఉంటోంది. కనుక ఈలోగా అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ ని పొందాలంటే ఎలాంటి తనఖా పెట్టాల్సిన పని లేదు. స్వయం సహాయక సంఘాల్లో వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
సమూహ్ శక్తి స్కీమ్ కింద మహిళలకు పది లక్షలు లోన్ వస్తుంది. రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్స్ కి అయితే సీజీఎఫ్ఎంయూ కవరేజ్ వుంది. రూ. 3 లక్షల వరకు రుణాలకు వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ కి వడ్డీ రేటు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు ఉంటుంది. అలాగే రూ. 5 లక్షలు లేదా ఆపై లోన్ కి 9 శాతంగా ఉంటుంది. కానీ జనవరి 15 నుంచి ఎంసీఎల్ఆర్ రేటును పెంచారు. దీనితో ఏడాది ఎంసీఎల్ఆర్ పైకి కదిలింది