బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. గూగుల్ కీలక నిర్ణయం..!

బీటెక్ చదువుతున్న విద్యార్థులందరికీ ఇటీవలే గూగుల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్నల్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తే గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం గూగుల్ నిర్వహించే ఇంజనీరింగ్ ఇంటర్నల్ సమ్మర్ 2021 బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులుగా తెలిపింది గూగుల్. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంటర్నల్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకునేందుకు ఆహ్వానించింది గూగుల్. ఇది నిజంగా ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు అందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పాలి.

అయితే గూగుల్ నిర్వహిస్తున్న ఇంటర్నల్ సమ్మర్ కేవలం 12 నుంచి 14 వారాల పాటు మాత్రమే ఉంటుంది అంటూ స్పష్టం చేస్తోంది. నిర్దేశిత సమయంలోనే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక గూగుల్ ఇంటర్న్షిప్ కోసం డిసెంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించగా ఇక ఇంటర్ షిప్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులు అందరూ కూడా హైదరాబాద్ బెంగుళూరు లోని క్యాంపస్లో గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్ను డెవలప్ చేయాల్సి ఉంటుంది అంటూ గూగుల్ తెలిపింది. ఇక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఎంతోమంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు.