గూగుల్ ఫోన్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. నిజ‌మైన కాల‌ర్స్‌ను గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న ఫోన్ యాప్‌లో ఓ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఫోన్ యాప్ లో ప్ర‌స్తుతం యూజ‌ర్ల‌కు వెరిఫైడ్ కాల్స్ పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్ ల‌భిస్తోంది. దీని స‌హాయంతో యూజ‌ర్లు త‌మ‌కు తెలియ‌ని నంబ‌ర్ల నుంచి వ‌చ్చే కాల్స్ నిజ‌మైన‌వేనా, కంపెనీలే కాల్ చేస్తున్నాయా, లేక స్పాం కాల్సా.. అన్న విష‌యాన్ని సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. కాగా ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ గూగుల్ ఫోన్ యాప్ ను వాడుతున్న ప‌లు దేశాల్లోని యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది.

google phone verified calls feature launched

అమెరికా, మెక్సికో, బ్రెజిల్‌, స్పెయిన్‌, భార‌త్‌లోని గూగుల్ ఫోన్ యాప్ యూజ‌ర్లు అందులో వెరిఫైడ్ కాల్స్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకు గాను యాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్న‌ప్పుడు యూజ‌ర్లకు ఏవైనా తెలియ‌ని నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే.. ఈ యాప్ ఆ నంబ‌ర్ల‌ను గుర్తించి అది ఏదైనా బిజినెస్‌కు చెందిన‌దా, లేక స్పాం నంబ‌రా అనే విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. దీంతో నిజమైన కాల్స్ ను యూజ‌ర్లు ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల అటు వ్యాపార సంస్థ‌ల‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది.

కాగా ప్ర‌స్తుతం చాలా మంది త‌మ ఫోన్లో లేని తెలియ‌ని నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే వాటిని బ్లాక్ చేసేలా యాప్స్ ను వాడుతున్నారు. దీని వ‌ల్ల నిజ‌మైన వ్యాపార సంస్థ‌ల నుంచి వ‌చ్చే కాల్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి. ఇది వ్యాపార సంస్థ‌ల‌కే కాక‌, యూజ‌ర్ల‌కూ న‌ష్టాన్ని క‌లిగిస్తోంది. కానీ గూగుల్ తెచ్చిన ఈ ఫీచ‌ర్ వ‌ల్ల తెలియ‌ని నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే.. ఆ నంబ‌ర్‌ను యాప్ గుర్తిస్తుంది. బిజినెస్ కాల్ అయితే సంబంధిత సంస్థ‌కు చెందిన పేరు, లోగో, అధికారిక నంబ‌ర్ వివ‌రాల‌ను యాప్ తెలియ‌జేస్తుంది. అదే స్పాం నంబ‌ర్ అయితే ఆ విష‌యాన్ని తెలుపుతుంది. దీంతో యూజ‌ర్లు స్పాం నంబ‌ర్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే కాక‌, నిజ‌మైన వ్యాపార సంస్థ కాల్స్ ను ఆన్స‌ర్ చేసి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వెరిఫైడ్ కాల్స్ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news