ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ముందు నుంచి పట్టుదలగా ఉన్న సిఎం జగన్… తాజాగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జాతీయ మీడియాతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్… పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ఆ విధంగా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సిఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఇక అమరావతిలో అవినీతి గురించి మాట్లాడుతూ… అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన… దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయమని స్పష్టం చేసారు. రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అనవసరం అని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.