29 యాప్లను తొలగిస్తున్న గూగుల్ ప్లేస్టోర్.. ఎందుకంటే ?

-

ప్రముఖ సంస్థ గూగుల్ తన యాప్ స్టోర్ అయిన ప్లేస్టోర్ లో పలు సవరణలు చేసింది. బుధవారం నిర్వహించిన యాప్ భద్రత తనిఖీల్లో యాడ్ వైర్ అనే కొత్త వైరస్ ను కనుగొన్నారు. ప్లేస్టోర్ లో ఉన్న 29 యాప్ ల ద్వారా ఈ వైరస్ ఆటోమెటిక్ మొబైల్ లోకి చేరుతుందని నిపుణులు వెల్లడించారు. ఆన్ లైన్ లో ఉండి ఈ యాప్ లను డౌన్లోడ్ చేసుకుంటే చాలని, దీంతో యాడ్ వేర్ వైరస్ ఫోన్ లో చేరుతుందని నిర్ధారించారు. వైరస్ కారణంగా 29 యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ తొలగించింది.

ap_resize
ap_resize

ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్ లు.. ఆటో పిక్చర్ కట్, కలర్ కాల్ ఫ్లాష్, స్క్వేర్ ఫోటో బ్లర్, స్క్వేర్ బ్లర్ ఫోటో, మ్యాజిక్ కాల్ ఫ్లాష్, ఈజీ బ్లర్, ఇమేజ్ బ్లర్, ఆటో ఫోటో బ్లర్, ఫోటో బ్లర్, ఫోటో బ్లర్ మాస్టర్, సూపర్ కాల్ స్క్రీన్, స్క్వేర్ బ్లర్ మాస్టర్, స్క్వేర్ బ్లర్, స్మార్ట్ బ్లర్ ఫోటో, స్మార్ట్ ఫోటో బ్లర్, సూపర్ కాల్ ఫ్లాష్, స్మార్ట్ కాల్ ఫ్లాష్, బ్లర్ ఫోటో ఎడిటర్, బ్లర్ ఇమేజ్ తదితర యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం జరిగింది.

యాప్స్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లో దాదాపుగా 3.5 మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్నాయి. వినియోగదారులు అధికంగా ప్లేస్టోర్ నుంచే యాప్ లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సటోరి అనే ఇంటెలిజెన్స్ టీమ్ భద్రత తనిఖీలు నిర్వహించారు. వీరి నివేదిక ప్రకారం ప్లేస్టోర్ లో ఎక్కువగా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయని గుర్తించారు. యాప్స్ లో బ్లర్ ఆఫ్షన్ ఉన్న యాప్ లు ప్రమాదకరమైనవని సటోరి ఇంటెలిజెన్స్ టీం ప్రకటించింది.

ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన 29 యాప్స్ తో చార్టర్ యూజర్ బ్లర్ అనే కోడ్ తో వైరస్ ఫోన్ లోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ 29 యాప్ లో ఏ యాప్ ని అయినా వినియోగదారుడు తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లో లాంచ్ ఐకాన్స్ వెంటనే కనిపించకుండా పోతాయన్నారు. దీంతో వినియోగదారులకు యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయడం కష్టమవుతుందన్నారు. వైరస్ బారిన మొబైళ్లను సురక్షితంగా ఉంచుకోవడానికి తొందరగా మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే అన్ ఇన్ స్టాల్ చేయాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news