ర‌షీద్ ఖాన్ భార్య అనుష్కశ‌ర్మ‌న‌ట‌.. మ‌రోసారి త‌ప్పులో కాలేసిన గూగుల్‌..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నిత్యం ఎంతో మంది ఎన్నో వెదుకుతుంటారు. అందుకు త‌గిన విధంగా గూగుల్ వెబ్‌సైట్ల‌ను వెదికి స‌మాచారాన్ని రిజ‌ల్ట్స్ రూపంలో చూపిస్తుంది. అయితే ఒక్కోసారి గూగుల్ పొర‌పాట్లు చేస్తుంటుంది. మ‌న‌కు తెలిసిన కొన్ని విష‌యాల‌ను కూడా అది తప్పుగా చూపిస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా గూగుల్ మ‌రో త‌ప్పిదం చేసింది.

google thinks anushka sharma is rashid wife

ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన స్పిన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ ప్ర‌స్తుతం ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అత‌నికి నిజానికి ఇంకా పెళ్లి కాలేదు. కానీ గూగుల్ మాత్రం అత‌నికి, న‌టి అనుష్క శ‌ర్మ‌కు పెళ్లి అయింద‌ని, పిల్ల‌లు ఉన్నార‌ని చూపిస్తోంది. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గూగుల్‌లో Rashid Khan wife అని టైప్ చేసి సెర్చ్ చేస్తే అనుష్క శ‌ర్మ అని ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

గూగుల్ ఇలా పొర‌పాటు చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో ప్ర‌ధాని మోదీని విష్ణువు 11వ అవ‌తారంగా చూపించింది. అలాగే ఇలాంటి అనేక పొర‌పాట్లు చేసింది. ఇక తాజాగా ఈ త‌ప్పు చేయ‌డంతో అంద‌రూ గూగుల్‌ను ఆట ప‌ట్టిస్తున్నారు. అయితే బాలీవుడ్ న‌టీమ‌ణులు అనుష్క శ‌ర్మ‌, ప్రీతి జింటా అనే త‌న‌కు ఇష్ట‌మ‌ని గ‌తంలో ప‌లు మార్లు ర‌షీద్ ఖాన్ ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. దాన్ని బ‌ట్టి గూగుల్ ఆటోమేటెడ్ సిస్ట‌మ్స్ ఇలా త‌ప్పుగా చూపిస్తుండ‌వ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని గూగుల్ స‌రిచేస్తుందా, లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news