నా బయోపిక్.. నా మనసుని తాకింది..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో.. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆకాశమే హద్దు రా. ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టి టి వేదికగా విడుదలై ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఈ సినిమా.

ఇక తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఎయిర్ దక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఆకాశమే నీ హద్దురా సినిమా చాలా బాగుందని తన మనసును తాకింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఓ యువ వ్యాపారవేత్త తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఓ వైపు భార్యకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగిన తీరును ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. తన జీవిత కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకురాలు సుధ కొంగర అద్భుతంగా నటించిన సూర్య కు కూడా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు గోపీనాథ్.