ఏపీలో గంజాయి రూ.5 వేలకే అమ్ముతున్నారు : గోరంట్ల బుచ్చయ్య

సీఎం జగన్‌ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మతి.. గతి తప్పి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మానసిక చికిత్స అందించాలి.. దీని కోసం పిచ్చాస్పత్రి లో చేర్పించాలని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని.. ఆంద్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రంగా పరిణమించడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక..వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని ఫైర్ అయ్యారు..

కేజీ 5 వేలు చొప్పున వేల కోట్ల రూపాయల దందా నడుస్తుందని నిప్పులు చెరిగారు. గంజాయి యువకులను నాశనం చేస్తుందని.. మత్తు పదార్దాల కేంద్రంగా రాష్ట్రం మారిందన్నారు. నిన్న గుజరాత్ లో పట్టు బడ్డ గంజాయి లింక్స్ ఆంద్రప్రదేశ్ కు సంబంధాలున్నాయని… అధికార పక్ష నాయకుల ప్రమేయం.. భాగస్వాయం లేకుండా ఇదంతా నడుస్తుందా..? అని ప్రశ్నించారు. సారా కు రంగేసి.. విస్కీ లు బ్రాందీలు గా చెలామణి చేస్తున్నారని… ఇవన్నీ స్థానిక ఎంపీ కి కనబడడం లేదా.? రాజమండ్రి ఎస్పీ కార్యాలయానికి కూతవేటు లోనే సారా కాస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ భరత్ కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయని చెప్పారు.