తెలంగాణలో రూ.934 కోట్లు పెట్టుబడి పెట్టనున్న కార్నింగ్ సంస్థ

-

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ సిద్దమైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. మెటిరీయల్ సైన్సెస్‌లో అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ మన దేశంలో మొదటిసారి స్మార్ట్ ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్ తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ త‌యారీ ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని కార్నింగ్ కంపెనీ నిర్ణ‌యించిందని, ఇందుకోసం రాష్ట్రంలో రూ.934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ తెలిపిందని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ భారత్‌లో మొదటిసారి స్మార్ట్‌ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులతో 800 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version