గుడ్ న్యూస్ : తెలంగాణలో కరోనా టెస్ట్ రేట్లు తగ్గించిన ప్రభుత్వం

తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ప్రైవేటు ల్యాబరేటరీస్ లో కోవిడ్ 19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం కొద్ది సేపటి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీస్ లో పరీక్షలకు వసూలు చేసే ధరలు సవరిస్తూ కొద్ది సేపటి క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్ లో పూర్తిగా అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులకు ప్రస్తుతం ల్యాబులు 2200  వసూలు చేస్తోండగా ఇకపై 850 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఇక హోం సర్వీస్ కోసం 2800 రూపాయలు ఉండగా దానిని 1200 రూపాయలకు తగ్గించింది ప్రభుత్వం. అయితే ఇది ప్రజల సౌకర్యార్ధమే అని ప్రజలు ప్రభుత్వ టెస్టింగ్ ఫెలిసిటీ వాడుకోవాలని తెలంగాణా ఆరోగ్య శాఖ పేర్కొంది.