రోజా గుట్టు బ‌య‌ట‌ప‌డిపోయిందా… సొంత మీడియాపైనే చిందులు…!

-

జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు చిత్ర‌మైన ఇబ్బంది వ‌చ్చింది. అనూహ్య ప‌రిణామంతో ఆమె సిగ్గు ప‌డిపోతున్నారు. పైగా త‌మ‌కు అనుకూల‌మైన ఓ మీడియాలోనే ఆమెకు సంబంధించిన గుట్టు వెల్ల‌డికావ‌డంతో రిపోర్ట‌ర్‌కు ఫోన్ చేసి మ‌రీ రోజా చిందులు తొక్కార‌ని వైసీపీ నేతలు చ‌ర్చించుకుంటున్నారు. విష‌యం చిన్న‌దే అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు తాను కాపాడుకుంటూ వ‌స్తున్న గుట్టు ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డిపోవ‌డం.. సోష‌ల్ మీడియాలో రోజాపై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. దీంతో ఆమెకు పిచ్చ‌కోపం.. వ‌చ్చేసింద‌ట‌. దీంతో ఫోన్ అందుకుని.. స‌ద‌రు వార్త రాసిన రిపోర్ట‌ర్‌కు ఫోన్ చేసి ఫైరయ్యార‌ట‌.

విష‌యంలోకి వెళ్తే తాజాగా రోజా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమె జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అయితే.. ఈ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.  వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సినీ పరిశ్రమలోనూ సుధీర్ఘ కాలం కొనసాగిన రోజుకు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందాయి. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అనుకూల మీడియాకు ఆమె ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. స‌హ‌జంగానే జ‌బ‌ర్ద‌స్త్ రోజా కావ‌డంతో దీనికి క్రేజ్ బాగా ఉంది.

సోష‌ల్ మీడియాలో ఆమె వేడుకలు బాగా వైర‌ల్ అయ్యాయి. అయితే.. ఈక్ర‌మంలో రిపోర్ట‌ర్ అత్యుత్సాహానికి లోన‌య్యారో.. ఏమోతెలియ‌దు కానీ.. రోజాకు సంబంధించి.. ఇప్ప‌టి వ‌రకు ఆమె గుట్టుగా ఉంచుకున్న కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. స‌హ‌జంగా సినీ రంగంలో ఉన్న‌వారు.. లేదా.. పొలిటీషిన్లు పుట్టిన రోజులు జ‌రుపుకొన్నా.. వ‌య‌సును ఎక్క‌డా చెప్ప‌రు. ఈ విష‌యంలో ఇప్పుడు అటు టెలివిజ‌న్ రంగంలోను, ఇటు రాజ‌కీయాల్లోనూ దూకుడుగా ఉన్న రోజా.. అయితే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఆఫ‌ర్ ఎక్క‌డ పోతాయోన‌ని అనుకోవ‌చ్చు.. లేదా మ‌రేదైనా కార‌ణం కావొచ్చు. దీంతో వ‌య‌సును అస్స‌లు బ‌య‌ట‌పెట్ట‌రు.

కానీ, స‌ద‌రు మీడియా మిత్రుడు మాత్రం.. రోజా వ‌య‌సును డేటాఫ్ బ‌ర్త్‌, సెక‌న్లు, నిముషాల‌తో స‌హా బ‌య‌ట పెట్టేశారు. అంతే! ఇంకేముంది.. రోజాపై కామెంట్లు కుప్ప‌లు తెప్ప‌లు తెప్ప‌లుగా వెల్లువెత్తాయి. సీఎం జ‌గ‌న్ క‌న్నా వ‌య‌సులో పెద్ద‌ద‌ని.. ఫిఫ్టీకి ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. వ‌న్నె త‌గ్గ‌లేద‌ని.. ఇలా కామెంట్లు కురిశాయి. దీంతో రోజా.. సిగ్గుప‌డిపోయార‌ట‌. అంతేకాదు.. రిపోర్ట‌ర్‌కు ఫోన్ చేసి.. పొర‌పాటున నీకు చెప్పాను.. అంటూ.. త‌న‌ను తాను తిట్టుకుంటూనే ఆయ‌న‌పైనా ఫైర‌య్యార‌ట రోజా..! ఇదీ సంగ‌తి…!

Read more RELATED
Recommended to you

Latest news