బిగ్ బ్రేకింగ్: ఈటెల భూముల అక్రమాలపై కమిటీ వేసిన సర్కార్

గత మూడు నాలుగు రోజుల నుంచి ఈటెల రాజేంద్ర భూ కబ్జాల వ్యవహారం సంచలనాలు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శామీర్ పేట మండలం దేవరయంజల్ వద్ద భూ అక్రమాలకూ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ఆద్వర్యంలో కమిటీ వేసారు.

ఇక్కడ సీతారామ స్వామి భూములను కబ్జా చేసారని ఆరోపణలు వచ్చాయి. దేవాలయ భూములనే కబ్జా చేసారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈటెల రాజేంద్ర కూడా స్పందించారు. చావనైనా చస్తా గాని ఆత్మగౌరవం మాత్రం అమ్ముకునేది లేదని ఆయన స్పష్టం చేసారు. దేవుడు లాంటి తమ్ముడు దెయ్యం ఎలా అయ్యాడని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎన్ని రోజులు జైల్లో పెడతారని ఆయన ప్రశ్నించారు.