మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు… మేడం నుంచి గ్రీన్ సిగ్నల్…!

-

మహారాష్ట్రలో అనేక పరిణామాల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకి శివసేన, కాంగ్రెస్, కాంగ్రెస్ ఎన్సీపీ సిద్ధమయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన భేటీలో ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శరద్ పవార్ నివాసంలో కాసేపటి క్రితం కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, బాలా సాహెబ్ తోరత్, పృథ్వీరాజ్ చౌహాన్, నసీబ్ సింగ్, ఎన్‌సిపి నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత…

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పరిస్థితులను సోనియా గాంధీకి వివరించారు నేతలు. సోనియా కూడా ప్రభుత్వ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శివసేనతో కలిసి రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు… ఈ మూడు పార్టీలు దాదాపుగా తెరదించాయి. శివసేనతో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా లేదా అనే దానిపై ఎన్సీపీ నుంచి ప్రకటన కోసమే ముందు ఎదురు చూసారు. శరద్ పవార్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్ధం కాక శివసేన నేతలు కంగారు పడ్డారు.

రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదా అని ప్రశ్నించగా… అవునా అని సమాధానం ఇచ్చారు. దీనిపై మాట్లాడిన శివసేన సీనియర్ నేత… సంజయ్ రౌత్… అసలు ఆయన మాటలు అర్ధం చేసుకోవాలి అంటే పది జన్మలు ఎత్తాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇక బుధవారం ఉదయం పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై మహారాష్ట్రలో రైతుల సమస్యలను వివరించారు. దీనితో బిజెపితో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news