GHMCలో 1540 ఆశాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వివాదం చెలరేగుతున్నప్పటికీ.. తెలంగాణ నిరుద్యోగులకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశాల పోస్టుల భర్తీకి కేసీఆర్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ (323), మేడ్చల్ (974), రంగారెడ్డి (243) జిల్లాల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేయనున్నారు. ఈ ప్రకటనతో… నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ కార్యాలయంలో తొమ్మిది మంది నిందితుల విచారణ మూడవ రోజు ముగిసింది. మూడో రోజు కస్టడీ విచారణలో కీలక ఆధారాలు సేకరించింది సిట్. ప్రవీణ్, రాజేశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారంతో పలువురు అనుమానితులను విచారించింది సిట్.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోదాలు జరిపింది.ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న రేణుక తో పాటు ఆమె భర్త డాక్యా నాయక్ పై వేటు పడింది. రేణుక వనపర్తి జిల్లా బుద్ధారం గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. భర్త డాక్య నాయక్ వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ స్కీమ్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news