తెలంగాణ విద్యాసంస్థల రీ ఓపెనింగ్ కి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలు ప్రారంభం యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీ వేశారు. ఈ నెల 18 లోపు యాక్షన్ ప్లాన్ ని ప్రభుత్వానికి కమిటీ పంపించాలి. మార్గదర్శకాల ప్రకారం విద్యా సంస్థలను సానిటైజ్ చేయాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. హాజరు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకారం తప్పనిసరిగ ఉండాలి.
అలానే ఫిజికల్ గా హాజరు కావాలని ఎవరి పై ఒత్తిడి తీసుకురావద్దని కూడా పేర్కొన్నారు. హైస్కూలు 9,10 తరగతులు రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్ లోనే తరగతులు జరగనున్నాయి. తరగతి కి 20 మంది కన్నా ఎక్కువ ఉండొద్దని, విద్యార్థి విద్యార్థికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 8 వ తరగతి వరకు విద్యార్థులను డిటెన్షన్ చేయకూడదని, హాజరు శాతం సరిపోను లేదని విద్యార్థులను పరీక్షల కు నిరాకరించవద్దని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల్లో కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాలలో పేర్కోన్నారు.