తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్దం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే అన్ని రాష్ట్రాల్లో 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతోంది. ఇప్పటికే తెలంగాణకు 3.64 లక్షల డోసులు చేరుకున్నాయి. అన్ని జిల్లాలకు ఇప్పటికే 15 లక్షల సిరంజీలను కూడా పంపిణీ చేశారు.

ఇక తెలంగాణవ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ జరగనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వాసుపత్రులు కలిపి 99 వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రిలో టీచింగ్ సెంటర్లలో 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. నిజానికి ముందుగా తెలంగాణకు 6.5 లక్షల డోసులు వస్తాయని భావించినా అందులో సగం మాత్రమే వచ్చాయి. ఇక వ్యాక్సిన్ నిలివ చేసిన కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దం అయింది. ఈరోజు రెండు రాష్ట్రాల్లో మెయిన్ వ్యాక్సిన్ గోడౌన్ నుండి వ్యాక్సిన్ ని జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.