బంపర్ ఆఫర్.. ఆ సర్కారీ స్కూల్ లో చేరితే ₹1000 డిపాజిట్ !

-

సాధారణంగా సర్కారీ బడుల్లో పిల్లలను చేర్చాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు.. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే అక్కడ ఏ మాత్రం సదుపాయాలు బాగోవని బోధనా విధానం కూడా సరిగా ఉండదని తల్లిదండ్రుల భావన. అయితే ఈ భావన పోగొట్టేందుకు ఒక సర్కారీ టీచర్ కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని నూలగిరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక టీచర్ విద్యార్థులను బడికి రప్పించేందుకు ఒక వినూత్న విధానం అమలు చేస్తున్నారు.

రేఖ ప్రభాకర్ అనబడే సదరు టీచర్ ఆ ఊరి సర్కార్ స్కూల్లో ఒకటో తరగతిలో చేరే ప్రతి స్టూడెంట్ పేరిట ₹1000 బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అయితే సదరు విద్యార్థి 10వ తరగతి పూర్తి అయ్యాక ఆ వెయ్యి రూపాయలు వడ్డీతో సహా డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం తో సంబంధం లేకుండా తన సొంత డబ్బుతో ఈ పథకం అమలు చేస్తున్నారు రేఖ ప్రభాకర్. ఈ ఆఫర్ మహత్యమో లేక టీచర్ల మహత్యమో తెలియదు కానీ ఈ బడిలో చేరే పిల్లల సంఖ్య పెరిగిందట. 

Read more RELATED
Recommended to you

Latest news