BREAKING : ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకం

-

జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నియమించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. రెండు రోజుల క్రితం డిజిపి పోస్ట్ నుంచి బదిలీ అయిన గౌతమ్ సవాంగ్ ను… ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేసింది జగన్ సర్కార్.

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. కాగా  డిజిపి గౌతమ్ సవాంగ్ పై రెండు రోజుల క్రితం వేటు వేశారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి ని నియమించింది సర్కార్. డీజీపీగా వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్న రాజేంద్రనాథ్‌ రెడ్డి.. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు.గతంలో విజయవాడ సీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news