సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ

-

తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాత కామాఖ్య మరియు మహాపురుష్ శ్రీమంత శంకర్‌దేవ్ మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదించుగాక’’ అంటూ ట్విట్ చేశారు.

ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిశ్వశర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మరోవైపు సర్జికల్ స్ట్రైక్ పై తను అనుమానాలు ఉన్నాయంటూ… ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ట్విట్టర్ లో కేసీఆర్ గురించి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news