అదృష్టం కలిసొస్తే..నిష్టదరిద్రుడైనా అపరకుభేరుడు కావాల్సిందే..అయితే కొందరికి ఎర్లీగా జరుగుతుంది..మరికొందరికి కాస్త లేటుగా జరుగుతుంది. ఇతని 60కు అదృష్టం పట్టింది..కూలిపని చేసుకుంటూ బతికేవాడు..ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సినిమాల్లో ఫస్ట్ ఆఫ్లో పేదరికిం చూపించి..సెకండ్ ఆఫ్ లో బాగా లేపుతారు కదా..అచ్చం అలానా జరిగింది. ఈ కేరళ వాసి కథేంటో మీరు చూడండి.
అతని పేరు మమ్మికా (Mammikka). వయసు 60 ఏళ్లు. కేరళ వాసి. రోజు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈమధ్య అతని దశ తిరిగిపోయింది. ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ మోడల్ అయిపోయాడు. అందుకు కారణం ఓ ఫొటోగ్రాఫర్. ఫొటోగ్రాఫర్ షరీక్ వయలిల్ (Shareek Vayalil)… రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మమ్మికాలో ఓ మోడల్‌ని చూశాడు. తన కోసం ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చెయ్యమని కోరాట.మొదట తానేంటి ఫొటోషూట్ ఏంటి అనుకున్నాడు..కానీ షరీక్ వెంటపడ్డాడు. తాను సీరియస్ గానే అంటున్నానని చెబుతూ మొత్తానికి ఆ కూలిని ఒప్పించాడు.
ఆ తర్వాత మమ్మికాని సెలూన్ కి తీసుకెళ్లి… గెటప్ మార్చేశారు. ఫారిన్ లుక్ వచ్చేలా చేశారు. సూటూ బూటూ వేశారు. చేతిలో ఐపాడ్ పెట్టి స్టైల్ గా పోజ్ కొట్టించారు. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ shk_digitalలో పోస్ట్ చేశారు షరీక్. అంతే అవి వీర లెవల్లో వైరల్ అయ్యాయి. మమ్మికా చూడటానికి నటుడు విజయకాన్ లా ఉన్నాడని నెటిజన్లు షరీక్ ని మెచ్చుకున్నారు.
మమ్మికాకి మేకప్ ఆర్టిస్ మజ్నాస్ మేకప్ వేశారు. మజ్నాస్ కి ఆషిక్ ఫ్వాద్, షబీబ్ వయాలిల్… మేకప్ అసిస్టెంట్లుగా పనిచేశారు. మమ్మికాకి సంబంధించిన స్టిల్స్, వీడియో క్లిప్ లను షరీక్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.. ఇప్పుడు మమ్మికాకి కూడా సొంతంగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఉంది. అందులో ఆయన తన ఫొటోలు, స్టిల్స్ పోస్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం మమ్మికాకి క్రేజ్ బాగుంది. మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. . కోజికోడ్… కొడివల్లీలోని తన సొంతూరు వెన్నక్కడ్ లో మమ్మికా ఇప్పుడు హీరో అయిపోయాడు.మోడల్ గా మారినా… తన రోజువారీ కూలీ పని చేసుకుంటూనే ఉంటానని తెలిపాడు. ఎవరైనా మోడలింగ్ ఆఫర్లు ఇస్తే వాటిని ఒప్పుకుంటానని తెలిపారు. మమ్మికా కథ, ఆ ఫొటోగ్రాఫర్ కృషిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మమ్మికాలో మోడల్ ను గుర్తించిన ఫోటోగ్రాఫర్ షరీక్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram