ఘనంగా యాంకర్ శ్యామల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎంతందం..!!

-

ప్రముఖ యాంకర్ గా.. గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన ఈమె మొదట్లో సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. అయితే ఇదే సమయంలో బుల్లితెరపై క్లిక్ అవడంతో బిజీ యాంకర్ గా రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసే ఇంటర్వ్యూలకు యాంకరింగ్ చేస్తూనే మరో పక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ లు వంటి వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అంతేకాదు అదే సమయంలో గ్లామర్ షో చేయడంలో కూడా వెనకాడడం లేదు.

ఇదిలా ఉండగా సీరియల్ యాక్టర్ నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న ఈమె ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా యాంకర్ శ్యామల పుట్టినరోజు వేడుకలు ఇటీవల చాలా ఘనంగా జరిగాయి. తన భర్త నరసింహ అలాగే తన స్నేహితులు, సన్నిహితుల మధ్య తన పుట్టినరోజు వేడుకలను పూర్తి చేసుకుంది శ్యామల. అందుకు సంబంధించిన ఫోటోలను ఇటీవల షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలపై రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ప్రేమగా తన కొడుకుతో లిప్ లాక్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన గ్లామరస్ డ్రెస్ ఫోటో షూట్ కూడా షేర్ చేసింది. ఈ డ్రెస్ లో ఈమె మరింత అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్యామల బర్త్ డే కి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా హాజరవడం విశేషం.

అలాగే తోటి సీరియల్ యాక్టర్స్ కూడా ఈమె బర్త్డే సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు. ఈ ఫోటోలలో ఈమె అందం చూసి ఎంతందం అంటూ పాటలు కూడా పాడేస్తున్నారు అభిమానులు..

 

View this post on Instagram

 

A post shared by Are Syamala (@syamalaofficial)

Read more RELATED
Recommended to you

Latest news