దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు: కేసిఆర్

-

తెలంగాణలో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలో మీడియాతో కెసిఆర్ మాట్లాడుతూ…’మేం కరీంనగర్ జిల్లాకు నాలుగైదు జలధారలు సృష్టించాం. అవి ఇప్పుడు ఎండిపోయాయి. గోదావరి ఎడారిగా మారింది అని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత వల్లే కరవు వచ్చింది. 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయింది. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు అని విమర్శించారు. వర్షాలు లేకపోవడం వల్లే కరవు వచ్చిందని చెబుతున్నారు. అది అబద్ధం’ అని కేసిఆర్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే… చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘భూదాన్ పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. రూ.50వేలు పరిహారం ఇవ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబును కోరా అని గుర్తు చేశారు.ఆ దుర్మార్గుడు, మూర్ఖుడు పట్టించుకోలేదు. నేను భిక్షాటన చేసి రూ.7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేశా అని పేర్కొన్నారు. BRS ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు ఎన్నో స్కీంలు తెచ్చా’ అని కేసిఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news