మహా అద్భుతం: మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం..!?

-

సాధారణ రోజుల్లో పాము కనపడితే చాలు జనాలు పరుగులు పెడుతుంటారు. కానీ ఏదైనా పండగ రోజుల్లో పాము కనపడితే చాలు దానిని దైవ సూచికంగా భావించి పూజలు చేస్తుంటారు. తాజాగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేత నాగు భక్తులకు దర్శనం ఇచ్చింది.

Swtha-Nagu-Appeared
Swtha-Nagu-Appeared

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణంలో పసుపునుటి సంతోష్ అనే వ్యక్తి ఇంటిలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. శ్వేతనాగును చూసిన కాలనీ వాసులు మంత్రముగ్దులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు, గుడ్లు సమర్పించారు. తెల్లటి వర్ణంతో ఉన్న ఆ పాము పడగవిప్పి భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది.

అయితే ఆ సమయంలో శ్వేత నాగు భక్తులు పోసిన పాలు తాగడం, భక్తులకు ఎలాంటి హాని చేయకపోవడం విశేషంగా మారింది. మహా శివరాత్రి పర్వదినాన శ్వేత నాగు దర్శనం ఇవ్వడంతో తమ జన్మ ధన్యమైందని క్లబ్ , కోర్టు రోడ్ కాలనీ వాసులు తెలిపారు. ఈ వార్త ఆ నోట ఈ నోట ఊరంతా పాకడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శ్వేత నాగును దర్శించుకున్నారు.

ఇక మరోవైపు శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

గురువారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news