ప్రస్తుతం రెండు సంవత్సరాల క్రితం జరిగిన కోడికత్తి సంఘటన ట్రెండింగ్ లోకి వచ్చింది. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దీనికి కారణం బెంగాల్ ఎన్నికలే. అవును. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యావత్ దేశానికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. మమతా బెనర్జీ నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన తర్వాత తన మీద దాడి జరిగిందని ఆరోపించడం, అస్వస్థతకి గురవుతూ కారులో నుండి దిగడం, ఆ తర్వాత ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్న ఫోటోలు బయటకు రావడం చూసాక కోడికత్తి హ్యాష్ ట్యాగ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఈ రెండు సంఘటనలు ఒకేలా ఉన్నాయని, వాటి రూపకర్త ఒక్కరే అనీ, అది ప్రశాంత్ కిషోర్ అని చెప్పుకుంటున్నారు. 2019ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నాడు. ఇదంతా అతని వల్లే జరిగిందని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ జగన్ గెలిచినట్టుగానే అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించి మమత బెనర్జీ గెలుస్తుందేమో చూడాలి.