బ్రేకింగ్ : ఆర్టీసి బస్సు బోల్తా.. 8 మంది మృతి

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగి పోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు, నిబంధనలు అమలు చేసినా… రోడ్డు ప్రమాదాలు మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఎక్కడో ఒకచోట… రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా.. ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.   దీంతో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు లో అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా… ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. డివైడర్ ను ఢీ కొట్టి జల్లేరు వాగు లో ఆర్టీసీ బస్సు బోల్తా పడినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పదిమందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. అలాగే ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో… 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.