ఇండియాలో వృద్ధి చెందుతోన్న క్రీడా వ్యాపారం..!

-

భారతదేశంలో క్రీడాకారుల అభిమానుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. క్రీడలపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇండియాలో క్రీడా వ్యాపారం ఊపందుకుంది. భారత క్రీడా మార్కెట్‌లో రూ.కోట్లు ఆర్జించే పరిశ్రమగా మారింది. తాజాగా బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఇన్‌వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఒక నివేదికను ప్రకటించింది. ఇందులో భారత క్రీడారంగం రానున్న 5 ఏళ్లల్లో దాదాపు 5 రెట్ల వరకు అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. 2027లో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

కాగా, 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లు వృద్ధి చెందుతుందని పేర్కొంది. స్పోర్ట్స్ బిజినెస్‌లో మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన మీడియా హక్కులు, స్పోర్ట్స్ డ్రెస్సులు, న్యూట్రిషన్స్ ఇతర వస్తువుల అమ్మకాలను చేర్చింది. క్రీడా వ్యాపారంలో ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కొత్త శిఖరాన్ని తీసుకెళ్తోందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ చూసే వారి సంఖ్య కోట్లల్లో ఉండగా.. వాణిజ్యపరంగా దీనికి బాగా డిమాండ్ ఉంది. 2023-2027 మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార మీడియా హక్కులు రూ.48,390 కోట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఒక్కో మ్యాచ్ ధరతో పోల్చితే 100 శాతం పెరిగింది. అలాగే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించనున్నట్లు ఒక ప్రముఖ టీవీ ఛానల్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news