జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే.. పెట్రోల్, డిజీల్ పై చర్చ

-

వస్తుసేవల పన్ను పరిధిలోకి పెట్రోల్, డీజిల్ కూడా రావాలంటూ చాలా రోజులుగా చర్చ నడుస్తున్నది. ఈ మేరకు ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. దాదాపు 20నెలల తర్వాత తొలిసారిగా భౌతిక సమావేశం నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ మీటింగ్స్ జరిగాయి. ప్రస్తుతం భౌతికంగా జరుగుతున్న ఈ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చ జరగనుంది.

అదీగాక కోవిడ్ డ్రగ్స్ పై ఉన్న పన్నుల మినహాయింపును మరికొద్ది కాలంపాటు పెంచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీ వంటి వాటికి పన్నులు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి 45వ జీఎస్టీ సమావేశంలో హాజరు కానున్న రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news