బంప‌ర్ ఆఫ‌ర్‌.. GTA 5 గేమ్ ఫ్రీ.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

-

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇండ్ల‌కే ప‌రిమిత‌మై గేమ్స్‌ను తెగ ఆడుతున్న గేమింగ్ ప్రియుల కోసం ఇప్ప‌టికే అనేక సంస్థలు అనే ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. ఇక తాజాగా ప్ర‌ముఖ గేమ్స్ స్టోర్ కంపెనీ Epic Games Store కూడా బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. గేమింగ్ ప్రియులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డే GTA సిరీస్‌లోని GTA 5 గేమ్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

GTA 5 now available for free on epic games store

గేమింగ్ ప్రియులు GTA 5 గేమ్‌ను ప్ర‌స్తుతం Epic Games Store (https://www.epicgames.com/store/en-US/) లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే Just Cause 4, World War Z త‌దిత‌ర గేమ్స్‌ను ప‌రిమిత కాలం పాటు ఉచితంగా అందించే ఆఫ‌ర్‌ను Epic Games Store ప్ర‌వేశ‌పెట్టింది. దాంతోపాటు ఇప్పుడు GTA 5 గేమ్‌ను కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇక ఆ స్టోర్‌లో గేమ్‌ను క్లెయిమ్ చేసుకున్న వారికి GTA 5 Premium edition ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు క‌ల్పిస్తారు. ఎపిక్ మెగా సేల్స్ 2020 ఆఫ‌ర్‌లో భాగంగా ఈ గేమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

సాధార‌ణంగా GTA 5 గేమ్ ధ‌ర రూ.2,500 వ‌ర‌కు ఉంటుంది. కానీ ఆఫ‌ర్‌లో ఈ గేమ్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు ప్ర‌త్యేక ప్యాక్‌లు ఇందులో ఉచితంగా ల‌భిస్తాయి. వాటితో GTA Online గేమ్ ఆడుకోవ‌చ్చు. ఇక ఈ ఆఫ‌ర్ మే 21వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని ఎపిక్ గేమ్స్ స్టోర్ తెలియ‌జేసింది.

Read more RELATED
Recommended to you

Latest news