గుడివాడ తగ్గడంలేదుగా… క్యా డైలాగ్ హై!

-

రాజకీయాల్లో “నోరు” చాలా ముఖ్యమని చెబుతున్నంతమాత్రాన్న “నోరేసుకుని” పడిపోవడమే గొప్ప అని భావిస్తుంటారు కొందరు నేతలు! వ్యక్తిగత విమర్శలు చేయడం, అడ్డగోలుగా వాదించడమే గొప్ప వాక్ చాతుర్యం అని ఫీలయిపోతుంటారు.. ట్రంప్ కార్డులు అని పిలుచుకోవడం తెలిసిన విషయమే. అయితే… ఎంత గట్టిగా మాట్లాడాము అనేకంటే.. ఎంత అర్ధవంతంగా మాట్లాడాము అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఈ విషయంలో ఫస్ట్ క్లాస్ మార్కుల కోసం ప్రయత్నిస్తున్నారు అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర‌నాథ్!

తాజాగా గీతం విద్యాసంస్థలను జగన్ సర్కార్ ఏదో నాశనం చేసేస్తున్నారని.. విద్యాసంస్థలను తొక్కేస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని.. కోర్టు ఆర్డర్లను జగన్ సర్కార్ దిక్కరిస్తుందని పసుపు పత్రికలు, టీడీపీ నేతలు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై మైకందుకున్నారు అమరనాథ్!

తమ ఆధీనంలోని 43 ఎకరాలను క్రమబద్ధీకరించాలని ఆగస్టు 3న ముఖ్యమంత్రి జగన్‌ ను గీతం యాజమాన్యం కోరింద‌ని.. అయితే, ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు గీతం తీసుకుంద‌ని.. అది చాల‌ద‌ని మ‌ళ్లీ భూమి కావాల‌ని కోరింద‌ని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఫైనల్ గా… గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుందని కంక్లూజన్ ఇచ్చారు! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా… టీడీపీ “అవినీతి విశ్వవిద్యాలయాన్ని” నడిపిస్తోందని చుర‌క‌లంటించారు అమరనాథ్!

Read more RELATED
Recommended to you

Latest news