బ్రేకింగ్ : గుజరాత్ సిఎం విజయ్ రూపాని రాజీనామా

హుజరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపాన్ని రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు విజయ్ రూపానీ. అంతేకాదు తన రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ఇచ్చారు విజ‌య్ రూపానీ. అయితే ఆయన రాజీనామా ఎందుకు చేశారు అనే అంశం పై… ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే వ్యక్తిగత కారణాలు మరియు అనారోగ్య సమస్యల కారణం గానే ఆయన రాజీనామా చేసినట్లు… సమాచారం అందుతోంది. ఇక వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రూపాన్ని రాజీనామా అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016వ సంవత్సరం నుంచి విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ రాజీనామా అనంతరం విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. కాగా ఇటీవల కర్ణాటక సీఎం పదవికి ఎడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.