హుజురాబాద్ లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా : ఈటల

హుజురాబాద్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. సంగా రెడ్డి అందోల్ పబ్లిక్ మీటింగ్ లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ చర్చ జరుగుతుందని.. కేసీఆర్ కుట్రలు కు చరమ గీతం పాడే సత్తా హుజురాబాద్ కి ఉందన్నారు.

కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదని..హుజూరాబాద్ లో పోటీకి దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి హుజురాబాద్ పై దాడి చేస్తున్నారని.. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ వంగి వంగి దండాలు పెడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ గడ్డ పై ఖచ్చితము గా పోరాటం చేస్తుందని.. కేసీఆర్ డబ్బులు, కుట్ర, అధికార దుర్వినియోగం ను నమ్ముకున్నాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కి బరి గీసి ఆయన పాలన కి చరమ గీతం పాడుతామని.. తన సహచరుడు హరీష్ రావు కుట్రలు అమలు చేస్తున్నాడని మండిపడ్డారు.