హుజురాబాద్ లో ప్రచారానికి బ్రేక్ !

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ను వాయిదా వేస్తూ ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యం లో.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడ్డాక ఉప ఎన్నికల పై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో హుజూరాబాద్ నియోజక వర్గం లో పార్టీలు అన్నీ డీలా పడ్డాయి. ఉపఎన్నిక తేదీ వాయిదా పడటం తో ప్రధాన పార్టీల నాయకులు నిరాశకు గురయ్యారు. మొన్నటి వరకు హుజురాబాద్ లో పలు ప్రధాన పార్టీల నేతలు ఒకరి కంటే మరొకరికి దిటుగా ప్రచారం కొనసాగించారు. కాని తెలంగాణా రాష్ట్రలో ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవని తేలడం తో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదట. మరో మూడు నెలల వరకు ఉప ఎన్నిక.. లేదని తేలడం తో హుజూరాబాద్ ను వదిలేశారట నేతలు.